Homeఅంతర్జాతీయంkcr:సాఠేను మర్చిపోయినం

kcr:సాఠేను మర్చిపోయినం

సాఠేను మర్చిపోయినం

  • ఆయనకు భార‌త‌ర‌త్న ఇవ్వాలి
  • అన్నాభావు సాఠేను దేశం ప‌ట్టించుకోలేదు
  • పీడిత ప్ర‌జ‌ల త‌ర‌ఫున అన్నాభావ్ నిలిచారు.
  • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
  • సాఠే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి

ఇదేనిజం, స్టేట్ బ్యూరో: పీడిత ప్రజల పోరాడిన అన్నాభావ్ సాఠేను ఈ దేశం పట్టించుకోలేదని తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. దేశానికి గొప్ప సాహిత్యం అందజేసిన సాఠేను భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. మనదేశం ఆయనను మరిచిపోయినా.. రష్యా ప్రభుత్వం గుర్తించి సత్కరించిందన్నారు. మ‌హారాష్ట్ర యుగ‌క‌విగా, ద‌ళిత సాహిత్య చ‌రిత్ర‌లో ఆద్యుడిగా పేరొందిన అన్నాభావు సాఠే భ‌ర‌త‌మాత ముద్దు బిడ్డ అని కేసీఆర్ ప్ర‌శంసించారు. అన్నాభావు సాఠేకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని, ఈ ప్ర‌తిపాద‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కూడా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అన్నాభావు సాఠే గొప్ప‌త‌నాన్ని గుర్తించాల‌ని ప్ర‌ధాన‌మంత్రికి విజ్ఞ‌ప్తి చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.

103వ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్
మ‌హారాష్ట్ర‌లోని వాటేగావ్‌లో నిర్వ‌హించిన‌ అన్నాభావు సాఠే 103వ జ‌యంతి వేడుక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సాఠే చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. అనంత‌రం కేసీఆర్ ప్ర‌సంగించారు. ‘మ‌హారాష్ట్ర గ‌డ్డ‌కు నా ప్ర‌ణామం. అణ‌గారిన వ‌ర్గాల కోసం అన్నాభావు గొంతెత్తారు. స‌మ‌స్య‌ల‌ను చూసి అన్నాభావ్ ఎప్పుడూ వెన‌క్కి త‌గ్గ‌లేదు. వంచిత‌, పీడిత ప్ర‌జ‌ల త‌ర‌ఫున అన్నాభావ్ నిలిచారు. అన్నాభావు సాఠే గొప్ప‌ద‌నాన్ని ర‌ష్యా దేశం గుర్తించింది. కానీ మ‌న దేశం గుర్తించ‌లేక‌పోయింది. సాఠేను మ‌న దేశం ప‌ట్టించుకోలేదు. ర‌ష్యా ప్ర‌భుత్వం అన్నాభావ్‌ను పిలిపించి స‌త్క‌రించింది. అన్నాభావ్ సాఠేను లోక్‌షాహెర్ బిరుదుతో స‌త్క‌రించారు. ర‌ష్యాలోని గ్రంథాల‌యాల్లో అన్నాభావ్ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్ఠించారు. ర‌ష్యా క‌మ్యూనిస్ట్ నేత మ్యాక్సిమ్ గోర్కి న‌వ‌ల ‘మా’ ప్ర‌పంచ ప్ర‌సిద్ధి చెందింది. ‘మా’ అనే న‌వ‌ల వివిధ భాష‌ల్లో అనువాదం జ‌రిగి ప్ర‌తి దేశంలో అందుబాటులో ఉంది. ర‌ష్యా ప్ర‌భుత్వం అన్నాభావ్‌ను భార‌త మ్యాక్సిమ్ గోర్కి అని ప్ర‌శంసించింది.’ అని కేసీఆర్ పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img