Homeహైదరాబాద్latest NewsKCR : ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు

KCR : ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు

– కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
– ఈడీ, సీబీఐను కేంద్రం పావులుగా వాడుకుంటోందని ఆరోపణ


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) అరెస్టు రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఆయన అరెస్టు.. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అని అభివర్ణించారు. ప్రతిపక్షాలను లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోందని విమర్శించారు. హేమంత్‌ సోరెన్‌, కవిత అరెస్టులు ఇందుకు నిదర్శనమన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను కేంద్రం పావులుగా వాడుకుంటోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటి చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. అక్రమ కేసులను వెనక్కి తీసుకొని, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Recent

- Advertisment -spot_img