Homeతెలంగాణ#KCR #EWS : ఈడ‌బ్లూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌పై కేసిఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

#KCR #EWS : ఈడ‌బ్లూఎస్ రిజ‌ర్వేష‌న్ల‌పై కేసిఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు.
రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం.
రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి.
ఈడబ్ల్యూఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ముఖ్య‌మంత్రి నిర్ణ‌యంపై ఓసీ సంఘాల నాయ‌కులు, అగ్ర‌కులల‌కు చెందిన‌ పేద విద్యార్థులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
Economically backward classes in the state of telangana (EWS) reservation facility, the government decided to implement the Chief Minister KCR said. KCR said it would conduct a high-level review on the matter in two to three days and issue appropriate directions.
Ten per cent reservation in education and employment opportunities is required for the economically backward sections

Recent

- Advertisment -spot_img