విధ్వంసమైన తెలంగాణను కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ సన్నాహకు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను నంబర్ వన్ రాష్ట్రంగా చేయడానికి కేసీఆర్ 99 శాతం సమయాన్ని పాలనకే కేటాయించారన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పక్కన బెట్టి పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టి విజయం సాధించాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.