Homeజిల్లా వార్తలురేపు KCR​ డిశ్చార్జి

రేపు KCR​ డిశ్చార్జి

– నందినగర్​లోకి తన నివాసానికి వెళ్లనున్న కేసీఆర్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ రేపు (శుక్రవారం) డిశ్చార్జ్​ కానున్నారు. ఆయన ఇటీవల ఎర్రవల్లిలోని తన నివాసంలో గాయడిన విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్‌ ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్‌ కావడంతో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్​ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img