హైదరాబాద్ః తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. తమిళిసై బాబాయి, కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ వసంత్‌కుమార్ శుక్రవారం కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను పరామర్శించారు. సీఎం కేసీఆర్ వెంట బోయినపల్లి వినోద్‌కుమార్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఉన్నారు. తనను పరామర్శించేందుకు రాజ్‌భవన్‌కు వచ్చిన కేసీఆర్ కు గవర్నర్ తమిళిసై ధన్యవాదాలు తెలియజేశారు.