బీఆర్‌ఎస్ ధర్నాలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎగొట్టిన రూ.7,600 కోట్లు తమ ప్రభుత్వం చెల్లించిందని రైతుబంధు గుర్తు చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడుతూ… రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలతో రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామన్నారు. కేసీఆర్ పాలనలో రైతులు అయోమయానికి గురయ్యారని ధ్వజమెత్తారు. సన్నబియ్యానికి రూ.500 బోనస్ తో రైతులకు అండగా నిలిచామన్నారు.