హైదరాబాద్: కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ MP కల్వకుంట్ల కవిత తనకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని TRS రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. తనపై పార్టీ అధిష్ఠానానికి కవిత లేఖ రాశారని… ఆ లేఖపై సంతకాలు చేసిన ఎమ్మెల్యేలలో సగం మంది తనకు ఫోన్ చేసినట్లు పేర్కొన్నారు. కవితమ్మ ఒత్తిడి తట్టుకోలేకే లేఖపై సంతకం చేశామని MLAలు తనతో చెప్పారని DS అన్నారు. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసినట్లు ఆధారాలు ఉంటే తనను పార్టీ నుంచి Suspend చేయాలని సవాల్ విసిరారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను కీలక పాత్రను పోషించానని చెప్పారు. Sonia Gandhi ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో తనకే తెలుసని అన్నారు. తన కృషి ఎంతో ఉందనే విషయాన్ని KCR కూడా అనేక సార్లు చెప్పారని తెలిపారు. అలాంటిది తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో తనను అవమానించారని డీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు.
BJPలోకి పోతున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు నేను బీజేపీలోకి పోవాలంటే నన్ను ఎవరైనా ఆపే వారున్నారని ఆయన ప్రశ్నించారు. తాను ఏ పార్టీలో ఉన్నానో పార్టీ హైకమాండే చెప్పాలని డీఎస్ డిమాండ్ చేశారు. కొన్ని దుష్ట శక్తుల వల్లే తాను Congress Party ని వదిలిపెట్టాల్సి వచ్చిందని అన్నారు.