Homeతెలంగాణకాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్​ ట్రాప్‌ చేస్తున్నరు

కాంగ్రెస్ అభ్యర్థులను కేసీఆర్​ ట్రాప్‌ చేస్తున్నరు

– మా అభ్యర్థులను స్వయంగా సంప్రదిస్తున్నరు.
– వారే మాకు సమాచారం ఇచ్చారు
– కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టడం ఖాయమని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన బెంగళూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్​ పార్టీ సునాయాసంగా అధికారం చేపడుతుందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు సీఎం కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సీఎం కేసీఆర్​ స్వయంగా తమ పార్టీ అభ్యర్థులు సంప్రదించారన్నారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదని డీకే శివకుమార్​ పేర్కొన్నారు. మరోవైపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగనుంది. 500లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది.

Recent

- Advertisment -spot_img