Homeహైదరాబాద్latest NewsKCR : కేసీఆర్ కాళేశ్వరం విచారణలో కీలక మార్పు

KCR : కేసీఆర్ కాళేశ్వరం విచారణలో కీలక మార్పు

KCR : కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో ఆరోపణలు, అవకతవకలపై జరుగుతున్న విచారణలో కీలక మార్పు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఓపెన్ కోర్టు కాకుండా ఇన్-కెమెరా విచారణకు హాజరుకానున్నారు. రేపు ఉదయం 11:15 గంటలకు కేసీఆర్ కమిషన్ ముందు హాజరుకానున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని జుడీషియల్ కమిషన్ మాజీ సీఎం హోదాలో కేసీఆర్‌కు విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. కేసీఆర్ మొదట జూన్ 5న విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, ఆయన అభ్యర్థన మేరకు కమిషన్ తేదీని జూన్ 11కి మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ, అన్నారం, సుండిల్లా బ్యారేజీల నిర్మాణం, డిజైన్, నాణ్యత నియంత్రణ, ఆపరేషన్, మెయింటెనెన్స్‌లో జరిగిన లోపాలపై కమిషన్ విచారణ జరుపుతోంది.

ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా కమిషన్ ముందు హాజరుకానున్నారని సమాచారం. నిన్న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌తో హరీశ్ రావు భేటీ అయ్యారు, ఈ సందర్భంలో విచారణలో చెప్పాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు మరియు మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ ప్రశ్నించింది. వారి నుంచి సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా కేసీఆర్‌ను విచారించనున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img