హైదరాబాద్ః దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ఇయ్యాలని సీఎం కేసీఆర్ అభిప్రాపడ్డారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకుగానూ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. పీవీ శతజయంతి ఉత్సవాలపై ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో పీవీకి మెమోరియల్ కేంద్రాన్ని నిర్మిస్తామన్నారు. అసెంబ్లీలో పీవీ ఫోటో పెట్టాలని అధికారులకు సూచించారు. నెక్లెస్ రోడ్‌కు పీవీ జ్జ్ఞాన్‌మార్గ్‌గా మార్చాలని సీఎం నిర్ణయించారు. అలాగే పీవీ పుట్టి పెరిగిన లక్నెపల్లి, వంగరలను టూరిస్టు ప్లేస్‌లుగా డెవలప్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. ఏటా పీవీ పేరిట అంతర్జాతీయ అవార్డు ఇవ్వాలని యునెస్కోకు ప్రతిపాదనలు సైతం పంపుతామన్నారు. విదేశాల్లోనూ పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కమిటీ మెంబర్లకు కేసీఆర్ సూచించారు.