It is known that KCR started the Yadadri reconstruction work in 2016.
On 4.33 acres, the temple is adorned with many unique features such as domes, ramparts and ten-pointed stars.
Meanwhile, after their vision, Swami is reviewing the development work of KCR there.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో పర్యటిస్తున్నారు.
పర్యటనలో భాగంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి పూజలో కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.
అంతకు ముందు అర్చకులు కేసీఆర్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
యాదాద్రి పునర్నిర్మాణ పనులను 2016లో కేసీఆర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
4.33 ఎకరాల్లో గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు వంటి అనేక విశిష్టతలతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
కాగా, స్వామి వారి దర్శనం అనంతరం కేసీఆర్ అక్కడి అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పనులతో పాటు పూర్తయిన పనుల గురించి కేసీఆర్‌కు సంబంధిత అధికారులు వివరిస్తున్నారు.
యాదాద్రిలో చేపట్టాల్సిన మరిన్ని పనులపై అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. యాదాద్రి నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి.