ఉద్యమం ముసుగులో మాజీ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను, కార్యకర్తలను తీవ్రంగా మోసం చేశారని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ ఆరోపించారు. చాలా మంది బాధితులు ఉన్నారని, టీఆర్‌ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న తనను తెలంగాణ భవన్ నుంచి గెంటేశారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు… పోరాడి సాధించుకున్న తెలంగాణ అప్పుల పాల్జేసిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని పదేళ్లలో దాదాపు రూ. 8 లక్షల కోట్లు చేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన సాగిస్తున్నారని, ఆయనకు అండగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.