ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేడు తన 70వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లోని బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కొమురం భీం ఆఫిషాబాద్, చెర్యాల, చెన్నూరు టౌన్, మంథని, తిమ్మాపూర్, మల్కాజ్‌గిరి, దేవరకొండ, గొల్లపల్లి, కుత్బుల్లాపూర్, బెల్లంపల్లి, ధర్మపురి, బుగ్గారం, ఇనుగుర్తి, భూపాలపల్లి, రేగొండ, ములుగు, వరంగల్, టేకుమట్ల, ఎండపల్లి సహా పలు ఇతర ప్రాంతాల్లో కూడా సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రాంతాల్లో కేసీఆర్ జన్వదిన వేడుకల్లో భాగంగా ఆసుపత్రిలో పేషంట్లకు పండ్లు అందించారు. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదానాలు కూడా నిర్వహించారు.