నేటి నుంచి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార యాత్రకు బయలు దేరనున్నారు. కాసేపట్లో బస్సు యాత్ర ప్రారంభం కానుంది. మొదటగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి కేసీఆర్ యాత్ర ప్రారంభించనున్నారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి మిర్యాలగూడ బయలుదేరనున్నారు. మే 10వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. దాదాపు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో అవసరమైన ఏర్పాట్లను పార్టీ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు ఈ బస్సు యాత్రను ప్లాన్ చేశారు.