Homeహైదరాబాద్latest Newsఈ నెల 8న కేసీఆర్ కీలక సమావేశం

ఈ నెల 8న కేసీఆర్ కీలక సమావేశం

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవెల్లిలో ఈ నెల 08న కీలక సమావేశం జరగనుందని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం నాడు ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై అసెంబ్లీ, మండలి సమావేశాల్లో చర్చిస్తారని సమాచారం.మరోవైపు కేసీఆర్ కూడా ఈసారి సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img