Homeహైదరాబాద్latest Newsమరో ఏడాదిలో కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

మరో ఏడాదిలో కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉనికిని రాజకీయంగా లేకుండా చేయడమే తన అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వల్లే కేసీఆర్ నాలుగు గోడల మధ్య పరిమితమయ్యారని అన్నారు. కేటీఆర్‌ను బయటకు తీసుకొచ్చి కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశాను అని అన్నారు. మరో ఏడాదిలో కేసీఆర్ పేరు కనిపించకుండా చేస్తానన్నారు. ఏడాది తర్వాత కేసీఆర్ రాజకీయాలకు తెరపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు.
మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఇంట్లో కూడా పార్టీ వ్యవహారాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. దీపావళి అంటే టపాసులు చూస్తామని.. కానీ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో మాత్రం సారబుడ్లు చూస్తున్నామంటూ రేవంత్ రెడ్డి అన్నారు. దీపావళి పార్టీ అంటే విదేశీ మద్యం, క్యాసినో నాణేలు, డ్రగ్స్ ఉంటాయా అంటూ ప్రశ్నించారు. కేటీఆర్ , ఆయన బావమరిది పార్టీలకు ఫామ్ హౌస్ లు ఉండాలి కానీ మూసీ పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అక్కడే దుర్భరంగా గడపాలా అంటూ రేవంత్ రెడ్డి నిలదీశారు.

Recent

- Advertisment -spot_img