Homeరాజకీయాలుఉద్యోగాల భర్తీపై KCR మాట తప్పారు

ఉద్యోగాల భర్తీపై KCR మాట తప్పారు

– పాండిచ్చేరి మాజీ సీఎం నారాయణ స్వామి

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. సీఎం కేసీఆర్ మాట తప్పారని పాండిచ్చేరి మాజీ సీఎం, కాంగ్రెస్ నేత నారాయణస్వామి అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లాలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ…‘పదేళ్ల క్రితం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాట తప్పాడు. దేశంలోనే సెక్రటేరియట్​కు పోకుండా ఇంటి నుంచి పని చేసే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలన అమలు చేస్తాం’అని నారాయణస్వామి పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img