Homeసినిమా'Keda Cola' decent collections in US US లో ‘కీడా కోలా’ డీసెంట్ Collections

‘Keda Cola’ decent collections in US US లో ‘కీడా కోలా’ డీసెంట్ Collections

న్యూ వేవ్ డైరెక్టర్ తరుణ్​ భాస్కర్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘కీడా కోలా’బాక్సాఫీసు వద్ద హిట్​ టాక్​తో దూసుకుపోతున్నది. ఈ క్రైమ్ కామెడీ డ్రామాలో లెజెండరీ యాక్టర్ బ్రహ్మానందం కీలక పాత్ర పోషించారు. తాజా అప్‌డేట్‌ ప్రకారం.. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించింది, ఇప్పుడున్న కలెక్షన్లు కొనసాగితే.. ఈ సినిమా తొందరలోనే మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరే అవకాశముంది. ‘కీడా కోలా’థ్రిల్లింగ్ ఎలిమెంట్స్​తో బాగానే ఆకట్టుకున్నది. తరుణ్ భాస్కర్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. అందుకే,
యూఎస్​ మార్కెట్​లోనూ ఈ మూవీ అదరగొడుతోంది. చైతన్య రావు, జీవన్ కుమార్, విష్ణు ఓయ్, రఘు రామ్​తో పాటు డైరెక్టర్ తరుణ్​ భాస్కర్ సైతం ఈ సినిమాలో నటించారు. రానా దగ్గుబాటి సమర్పణలో వచ్చిన ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.

Recent

- Advertisment -spot_img