ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం ఈరోజు ఉదయం 7 గంటలకు తెరుచుకుంది. వేద పండితులు మంత్రోచ్చరణాలతో ఆలయ తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో కేదార్‌నాథ్ ఆలయం ఒకటి. ప్రస్తుతం భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఏటా శీతాకాలంలో ఆలయాన్ని మూసివేసి ఆరు నెలల తరువాత భక్తుల సందర్శన కోసం తెరుస్తారు. భక్తులు లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు.