ఉత్తరప్రదేశ్లో ఉపాధ్యాయుల కోసం తీసుకువచ్చిన డిజిటల్ హాజరు వ్యవస్థను ఆసరాగా చేసుకుని ఓ ఉపాధ్యాయుడు, తన తోటి మహిళ టీచర్ని ముద్దు కోరాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు.. మహిళా టీచర్ను తన గదిలోకి పిలిచి, హాజరు వేసేందుకుగానూ తనకు ముద్దు ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. అప్రమత్తమైన మహిళా ఉపాధ్యాయిని వీడియో తీసి అధికారులకు కంప్లైంట్ చేసింది. దీంతో ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. అలాగే డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థను నిలిపివేసింది.