Homeసినిమా'Keeda Cola' trailer.. Fun and thrill ‘Keeda Kola’ Trailer.. ఫన్ అండ్ థ్రిల్

‘Keeda Cola’ trailer.. Fun and thrill ‘Keeda Kola’ Trailer.. ఫన్ అండ్ థ్రిల్

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది లాంటి న్యూ వేవ్​ సినిమాలతో ఆకట్టుకున్నటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్​ తరుణ్​ భాస్కర్ నుంచి వస్తున్న మరో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ మూవీ ‘కీడా కోలా’. దాదాపు ఐదేండ్ల తర్వాత తరుణ్​ భాస్కర్​ డైరెక్షన్​లో వస్తున్న ఈ సినిమాపై మూవీ లవర్స్​తో యూత్​లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మనందం ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్​ రోల్​ చేస్తుండటం మరో విశేషం. గతంలో రిలీజైన కీడా కోలా టీజర్​కు మంచి రెస్పాన్స్​ రాగా.. బుధవారం మేకర్స్ ట్రైలర్​ను రిలీజ్ చేశారు. నటుడు రానా దగ్గుబాటి ఈ ట్రైలర్​ను లాంచ్​ చేశారు. ట్రైలర్​ మొత్తం ఫుల్ ఫన్ రైడ్​లో సాగింది. ఎంటర్​టైనింగ్ ఎలిమెంట్స్​తో పాటు థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్ కూడా కనిపిస్తున్నాయి. కొన్ని గ్రూప్ లు, వారి రికి ఉన్న ఇంట్రెస్టింగ్ కనెక్షన్స్, వీటిలో పొలిటికల్ షేడ్ తో కూడా కలిపి తరుణ్ భాస్కర్ ఒక మ్యాడ్ ఎంటర్టైనర్ డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే వీరందరికీ ఆ ‘కీడా కోలా’ అనే డ్రింక్ కి కనెక్షన్ ఏంటి అనేవి తన మార్క్ క్లీన్ కామెడీతో కూడా ఇందులో కనిపిస్తుండగా తరుణ్​ భాస్కర్ సైతం ఓ ఇంపార్టెంట్ రోల్​లో కనిపిస్తున్నాడు. వివేక్​ సాగర్ ఇచ్చిన బీజీఎం బాగుంది. ఇక ఈ సినిమా నవంబర్ 3న రిలీజ్ కానుంది.

Recent

- Advertisment -spot_img