తిరుమల లడ్డూ వివాదం సుప్రీకోర్టుకు చేరింది. సోమవారం విచారించిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘మైసూర్/ ఘజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.