Keeravani : దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మ్యూజిక్ రియాలిటీ షోగా ”పాడుతా తీయగా” పేరు గాంచింది. 1996 మే 16న లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ రియాల్టీ షోను ప్రారంభించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ప్రస్తుతం ఆస్కార్ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు కీరవాణి, గాయని సునీత, గీత రచయిత చంద్రబోస్ ఈ షోకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆస్కార్ గ్రహీత కీరవాణిపై ఒక సింగర్ సంచలన ఆరోపణలు చేసింది. ఇటీవలే ‘పాడుతా తీగ’ సిల్వర్ జూబ్లీ సిరీస్ వచ్చింది. ఇందులో గాయని ప్రవస్తి ఆరాధ్య కూడా పాల్గొంది. అయితే ప్రవస్తి ఆ షో నుండి ఎలిమినేట్ అయింది.
ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో ను విడుదల చేసింది. ఆమె ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి, గాయని సునీత, గీత రచయిత చంద్రబోస్‌లపై మానసిక వేధింపులు, బాడీ షేమింగ్ ఆరోపణలు చేసింది. ప్రవస్తి తన వీడియోలో జడ్జిలు పక్షపాతంతో వ్యవహరిస్తూ, నిజమైన ప్రతిభను అణచివేసి, తమకు ఇష్టమైన వారిని విజేతలుగా ఎంచుకుంటున్నారని ఆరోపించింది. ఎవరైనా పాడుతా తీగ కార్యక్రమానికి వెళ్లాలంటే రెఫరెన్సులు లేదా సిఫార్సులతో వెళ్లాలని, లేకుంటే అక్కడ అన్యాయం జరగడం ఖాయమని ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షోలో తాను పాట ఎలా పాడినా సునీత ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ పెట్టేదని, ఏదో ఒక తప్పులు కావాలని వెతికేదని, కీరవాణికి తనపై లేనిపోనివన్నీ చెప్పేదని ప్రవస్తి తెలిపింది. తన గొంతులో ఆకర్షణ లేదని చంద్రబోస్ వ్యాఖ్యానించేవాడని, కీరవాణి తనను చాలా విధాలుగా అవమానించాడని ప్రవస్థి వెల్లడించారు.
అలాగే మాది పేద కుటుంబం. కాబట్టి నేను పెళ్లిళ్లలో పాడేదాన్ని. కానీ కీరవాణి దీని గురించి పరోక్షంగా మాట్లాడుతూ, వివాహాల్లో పాడేవారు నా అభిప్రాయం ప్రకారం గాయకులు కాదని, నాకు అసహ్యం మరియు సంగీతానికి అవమానం అని అన్నారు. అది నాకు బాధ కలిగించింది అని ప్రవస్థి అన్నారు. ఆ షో నిర్మాణ బృందం చాలా దారుణంగా ప్రవర్తిస్తుంది. వాళ్ళు మాకు కాస్ట్యూమ్స్ ఇచ్చి, నడుము నుండి క్రిందికి చీరలు కట్టుకోమని, నాభి కనిపించేలా ఉండాలని చెప్పేవారు. అయితే నాకు మరో అవకాశం రాదని నాకు తెలుసు. అంత గొప్ప వ్యక్తి పేరును తీసుకొని నేను ఆరోపణలు చేస్తున్నాను. పరిణామాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని ప్రవస్థి ఆరాధ్య వివరించారు. ఈ వీడియో చూసిన తర్వాత, తనకు మరియు తన కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి కీరవాణి, సునీత మరియు చంద్రబోస్ అని ఆమె అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.