Homeసినిమాఎర్రగులాబీలు సీక్వెల్​లో మహానటి

ఎర్రగులాబీలు సీక్వెల్​లో మహానటి

కమల్​హాసన్​ సినీ జీవితంలో సంచలన చిత్రం ఎర్రగులాబీలు సీక్వెల్​లో మహానటి సినిమాతో తన టాలెంట్​ను చూపిన కీర్తి సురేష్​ నటించనున్నట్లు సమాచారం. నలభై రెండేళ్ల క్రితం వచ్చిన ఈ  చిత్రం అప్పట్లో పెద్ద హిట్​. కమలహాసన్, శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగప్పు రోజక్కల్’ తమిళ చిత్రాన్ని తెలుగులో ఎర్రగులాబీలుగా అనువదించారు. అప్పటి సినీ కథలకు భిన్నంగా ఉండడంతో ఈ చిత్రం యువతను ఆకర్షించింది. భయంకరమైన సైకో పాత్రలో కమలహాసన్ సరికొత్త నటనతో చిత్రం బాగా ఆడింది. అటువంటి ఈ చిత్రానికి ప్రస్తుతం సీక్వెల్ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ చిత్ర దర్శకుడు భారతీరాజా కొడుకు మనోజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి చంపి పాతిపెట్టే క్రూరమైన పాత్రలో కమల్​హాసన్​ నటించారు. కొత్త సీక్వెల్​లో అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలపై ప్రతీకారం తీర్చుకునే పవర్​ఫుల్​ పాత్రలో కీర్తీ సురేష్​ నటించనున్నారు. విభిన్న కథలకు కీర్తి సురేష్​ మాత్రమే న్యాయం చేయగలదని దర్శకుడు భావిస్తున్నాడు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img