Homeహైదరాబాద్latest Newsబంపరాఫర్ కొట్టేసిన కీర్తి సురేశ్.. మరో బాలీవుడ్ మూవీ ఛాన్స్..!

బంపరాఫర్ కొట్టేసిన కీర్తి సురేశ్.. మరో బాలీవుడ్ మూవీ ఛాన్స్..!

స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ అమ్మడి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడుతుందని తెలుస్తుంది. కీర్తి తన కెరీర్‌లో నటించిన ప్రతి సినిమాలోనూ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పించింది. అయితే కీర్తి సురేశ్ బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. వరుణ్ ధవన్ సరసన ‘బేబీ జాన్’ మూవీలో నటిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఆమె హీరోయిన్‌గా దాదాపు ఎంపికైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే నిజమైతే ఇక కీర్తి బాలీవుడ్‌లో పాగా వేస్తారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img