Keerthy Suresh : స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh ) ఇటీవలే గోవాలో తన 15 సంవత్సరాల ప్రియుడు ఆంటోనీ టాటిల్‌ను వివాహం చేసుకుంది. దీని తరువాత, ఆంటోనీ మరియు కీర్తి సురేష్ ఇద్దరూ తమ హనీమూన్‌కు వెళ్లారు. థాయిలాండ్ ట్రిప్ ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీని తర్వాత కీర్తి సురేష్ తన భర్తతో కలిసి చెన్నైలో జరిగిన పొంగల్ పండుగకు హాజరయ్యారు. తాజాగా కీర్తి సురేష్ తన వివాహ జీవితం గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది.
కీర్తి సురేష్ తన భర్త గురించి మాట్లాడుతూ.. ఆంటోనీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు అని తెలిపింది. తన భర్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా ప్రైవేట్‌గా ఉంటుంది అని చెప్పింది. అలాగే అతను మీడియాకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారని కీర్తి సురేష్ వెల్లడించింది. అయితే పెళ్లి తర్వాత తన భర్త ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ఉండటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడని కీర్తి సురేష్ చెప్పింది. దింతో ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.