Homeహైదరాబాద్latest Newsపదవిలో ఉండి అరెస్టయిన మొదటి CM Arvind kejriwal : Delhi Liquor Scam

పదవిలో ఉండి అరెస్టయిన మొదటి CM Arvind kejriwal : Delhi Liquor Scam


హైదరాబాద్‌: సీఎం పదవిలో ఉంటూ అరస్టయిన మొదటి వ్యక్తిగా అరవింద్‌ కేజ్రీవాల్ నిలిచారు. గతంలో బీహార్‌ సీఎంగా ఉన్నప్పుడు లాలూ ప్రసాద్‌ యాదవ్ పై అరెస్టు వారెంట్‌ జారీ అయ్యింది. ఆయన సీఎం పదవికి రాజీనామా చేసి తన భార్య రబ్రిదేవికి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అరస్టయిన హేమంత్‌ సోరెన్‌ అరెస్టుకు ముందు సీఎం పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు సీఎంగా ఉన్నప్పుడే జయలలితకు శిక్ష పడింది. ఆమె సీఎం పదవిని కోల్పోయారు. చట్టప్రకారం శిక్ష పడ్డాక పదవిని కోల్పోతారు.

దిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై ఈడీ చేస్తున్న ఆరోపణలు ఇంకా రుజువు కాలేదు. ఆయనకు శిక్ష పడలేదు. సీఎంగా కొనసాగేందుకు చట్టప్రకారం అడ్డంకులుండవని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం సాయంత్రం సుదీర్ఘంగా విచారించిన తర్వాత కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

అసలు ముఖ్యమంత్రిని అరెస్టు చేయవచ్చా?
రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని మాత్రమే పదవిలో ఉన్నప్పుడు అరెస్టు చేయడానికి వీలు లేదు. ఆర్టికల్‌ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు అధికార విధులకు సంబంధించి కోర్టులకు జవాబుదారీగా ఉండరు. కానీ, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు ఈ రక్షణ ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే అనేది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రికీ వర్తిస్తుంది. ముఖ్యమంత్రిని అరెస్టు చేయడానికి చట్టపరంగా అవకాశం ఉందని న్యాయనిపుణులు చెప్తున్నారు.

Recent

- Advertisment -spot_img