Homeహైదరాబాద్latest Newsజియో సినిమా యాప్‌ నుంచి కీలక ప్రకటన.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా?

జియో సినిమా యాప్‌ నుంచి కీలక ప్రకటన.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా?

ఐపీఎల్‌ను ఉచితంగా ప్రసారం చేస్తున్న జియో సినిమా యాప్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రారంభించనున్నట్లు ఆ కంపెనీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ఏప్రిల్ 25న ఈ కొత్త ప్లాన్ లాంచ్ అవుతుందని తెలిపింది. కానీ ఈ ప్లాన్ ద్వారా ఎలాంటి యాడ్స్ లేకుండా ఐపీఎల్ ప్రసారాలను వీక్షించవచ్చని తెలుస్తోంది. అయితే ఈ కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ ద్వారా జియో సినిమా యాప్‌ ద్వారా 4K నాణ్యత కలిగి వీడియోలు, ప్రసారాలను వీక్షించవచ్చు. అయితే ఈ ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం జియో సినిమా యాప్‌లో రెండు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు ఉన్నాయి. రూ.99 నెలవారీ ప్లాన్ మరియు రూ.999 వార్షిక ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ రెండు ప్లాన్‌లలో పూర్తిగా యాడ్ ఫ్రీ ఆప్షన్ లేదు. ప్రీమియం వినియోగదారులు కూడా కొన్ని ప్రకటనలను చూడవలసి ఉంటుంది.

Recent

- Advertisment -spot_img