రైతు భరోసా నిధులను ఈ నెల 30వ తేదీ నాటికి రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ రైతు భరోసా కోసం రూ.33 వేల కోట్లు సిద్ధం చేశామని ఆయన అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల రుణమాఫి చేయడంలో విఫలమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం దానిని పూర్తి చేసిందని ఆయన అన్నారు. రైతులను మోసం చేసి, ముంచిన వారే రుణమాఫీ గురించి మాట్లాడితే, ప్రజలు వారిని అసహ్యించుకుంటారని, వారు ప్రజలచే ఎగతాళి చేయబడతారని తుమ్మల హితవు పలికారు.