తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని చెప్పారు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు త్వరలో చేపడతామన్నారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని వెల్లడించారు. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని, ఇప్పటికే 50 వేల మందికి నియామక పత్రాలు అందించామని అన్నారు.