Homeహైదరాబాద్latest Newsకొత్త రేషన్ కార్డుల పై కీలక ప్రకటన.. అదనంగా మరో 15 లక్షల కొత్త కార్డులు..!

కొత్త రేషన్ కార్డుల పై కీలక ప్రకటన.. అదనంగా మరో 15 లక్షల కొత్త కార్డులు..!

తెలంగాణ కొత్త రేషన్ కార్డుల మంజూరుపై సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తుండగా.. వారికి గుడ్ న్యూస్ చెప్పారు. అక్టోబర్ తొలివారంలో రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డులతో పాటుగా ప్రజల ఆరోగ్యం కోసం హెల్త్ కార్డులను కూడా ఇస్తామని ఆయ‌న తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 89.6 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 15 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తాజాగా కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కొత్త రేషన్ కార్డుల జారీపై తుది ప్రక్రియ మరో రెండు మూడ్రోజుల్లో పూర్తి కానుంది. సెప్టెంబర్ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందించి విధి విధానాలు ఖరారు కానున్నాయి.

spot_img

Recent

- Advertisment -spot_img