ఏపీ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకంపై ఇటీవల ఒక కీలక ప్రకటన చేసింది. ఈ పథకం ద్వారా పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. పథకం ద్వారా ప్రతి అర్హత కలిగిన తల్లి ఖాతాలో ఏటా రూ.15,000 జమ చేయనున్నారు. అయితే ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు అసిస్ట్ సంస్థ సహకారంతో 309 సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని మాట్లాడుతూ.. మే నెలలో తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తామని, రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధి బాధ్యతలను మంత్రి లోకేశ్ తీసుకున్నారని అన్నారు. రాష్ట్రంలోని పాఠశాల విద్యను దేశంలో నెంబర్ వన్ గా నిలుపుతామన్నారు.