తెలంగాణలోని 203 గ్రామ పంచాయతీల్లో కొత్త ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీకి కనీసం ఒక ప్రభుత్వ పాఠశాల తప్పనిసరని, దానిపై నివేదిక సమర్పించాలని గతంలో సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కొద్దిరోజుల తర్వాత 257 పంచాయతీల్లో పాఠశాలలు లేవని డీఈఓలు ప్రాథమిక నివేదిక సమర్పించారు. 122 చోట్ల అవసరమైన వాటిని ప్రస్తావించారు. దానిపై మరోసారి క్షేత్రస్థాయిలో క్షుణ్నంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.