ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వంలో పాస్ పుస్తకాలు, సరిహద్దు రాళ్లపై వేసిన జగన్ బొమ్మల్ని పూర్తిగా తొలగించాలని క్యాబినెట్ తీర్మానం చేశారు. పట్టదారు పుస్తకాలపై జగన్ ఫోటోలను తొలగించి 21లక్షల కొత్త పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నంతో ముద్రించాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలో భూమి హద్దులు నిర్ణయించేందుకు 77 లక్షల సర్వే రాళ్లపై వేసిన జగన్ ఫోటోలు తొలగించాలని నిర్ణయించారు. దీంతో పాటు వివాదాస్పద భూములు, 22ఏ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని నిర్ణయించారు.