Homeహైదరాబాద్latest Newsశబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం

అయ్యప్ప భక్తులకు షాకింగ్ న్యూస్ కేరళ రాష్ట్ర ప్రభుత్వం శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. గతంలోలా కాకుండా దర్శనానికి అనేక ఆంక్షలు విధించారు. శబరిమల అయ్యప్ప దర్శనంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ప్రకటించారు. ఒక్క అయ్యప్ప స్వామికి రోజుకు గరిష్టంగా 80 వేల మందికి దర్శనం కల్పిస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులు తెలిపారు. వర్చువల్ క్యూబిక్ బుకింగ్ సమయంలో భక్తులు తమ ప్రయాణ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుందని శబరిమల అయ్యప్ప ఆలయ అధికారులు వెల్లడించారు. మూడు నెలల ముందుగానే వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు 10 రోజుల ముందు మాత్రమే బుకింగ్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు దానిని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు మూడు నెలలకు పెంచింది. శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా బుక్ చేసుకున్న వారికి దర్శన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

Recent

- Advertisment -spot_img