బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని.. రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల పరిహారం అందిస్తున్నామని అల్లు అరవింద్ తెలిపారు. దర్శకుడు సుకుమార్ తరఫున రూ. 50 లక్షలు, అల్లు అర్జున్ తరఫున రూ. కోటి, మైత్రి తరఫున రూ. 50 లక్షలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు ద్వారా బాలుడి కుటుంబానికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు దిల్ రాజుకు చెక్ ను అందజేశారు.