Homeహైదరాబాద్latest Newsరేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులకు 5000 బోనస్..!

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులకు 5000 బోనస్..!

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2023-24లో సంస్థకు వచ్చిన లాభాల్లో 33% కార్మికులకు బోనస్ గా ప్రకటిస్తునట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. గతేడాది సంస్థకు రూ.4,701 కోట్ల లాభాలు రాగా అందులో రూ.796 కోట్లను బోనస్ గా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.1.90 లక్షలు బోనస్ అందుతుందన్నారు. చరిత్రలో తొలిసారి సింగరేణి కాంట్రాక్ట్ ఉద్యోగులు 25వేల మందికి రూ.5000 బోనస్ ఇస్తునట్లు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img