తెలంగాణలో త్వరలోనే ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 4 కోట్ల ప్రజల హెల్త్ ప్రొఫైల్స్ను డిజిటలైజ్ చేయాల్సి ఉందని చెప్పారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ రెనోవా క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం ప్రారంభించి మాట్లాడారు. విద్య, ఆరోగ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు.