ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి భారతీయ రైల్వేలు నిరంతరం నవీకరించబడతాయి. ఇప్పటికే మన దేశంలో చాలా మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుంది. తాజాగా తెలంగాణ నుంచి రైలు కనెక్టివిటీని పెంచాలని భావించిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరుతో పాటు నాగ్‌పూర్ నగరానికి వందేభారత్ రైళ్లను తీసుకొచ్చింది. సికింద్రాబాద్ – నాగ్‌పూర్ ప్రయాణికులు వందే భారత్ ఎక్స్ప్రెస్ ను అందుబాటులోకి భారతీయ రైల్వే శాఖ తెచ్చింది. సెప్టెంబర్ 16న ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించేందుకు ఈ కొత్త వందే భారత్ రైలును ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించేందుకు ఈ కొత్త వందే భారత్ రైలును ఏర్పాటు చేసారు. అయితే ఈ రైలు కేవలం 20 బోగీలతో నడుస్తుండగా.. రైలులో 80 శాతం సీట్లు కూడా నిండలేదని.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రైలు 20 బోగీలతో రైలు నడుస్తుండగా.. 10 బోగీలకే పరిమితం చేయాలని యోచిస్తున్నారు. నాగ్‌పూర్ రైలులో 10 కోచ్‌లను తగ్గించి, అదనపు కోచ్‌లను సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-విశాఖ, కాచిగూడ-యశ్వంతపుర రైళ్లకు చర్చిస్తున్నారు.