తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను బట్టి తెలంగాణ ప్రభుత్వం గుడ్డుతో కూడిన మయోనైజ్‌ను నిషేధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గుడ్డు ఆధారిత మయోనైస్‌తో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది కనీసం పది ఫుడ్ పాయిజనింగ్ కేసులు సంభవించినట్లు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు నివేదించారు. ఇదే కనుక నిజమైతే తెలంగాణ రాష్ట్రంలో బ్యాన్ చేయబడిన మొదటి ఆహార ఉత్పత్తి గుడ్డు ఆధారిత మయోనైస్ అవుతుంది.