రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ORR అప్రోచ్ రోడ్డుకు.. రతన్ టాటా పేరు పెట్టాలని ఆలోచన చేస్తోందట తెలంగాణ ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్డు అప్రోచ్ రోడ్డుకు.. రతన్ టాటా పేరు పెట్టే అవకాశాన్ని పరిశీలిస్తామని ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు నుండి ఆదిభట్ల వరకు గల అప్రోచ్ రోడ్డుకు రతన్ టాటా మార్గ్ అని పేరు పెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆదిభట్లలో TCS కార్యాలయం ఉందన్న సంగతి తెలిసిందే.