ప్రయాణికుల సౌకర్యార్థం TGSRTC కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో పల్లె బస్సులు, సిటీ బస్సుల్లో ప్రయాణికులకు నగదురహిత డిజిటల్ చెల్లింపుల విధానం అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు కల్లా సిటీ సర్వీసుల్లో, సెప్టెంబరు నాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతను విస్తరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కండక్టర్లకు 10 వేల ఐ-టిమ్స్‌ను అందించేందుకు ఏర్పాట్లుచేస్తోంది. అలాగే, మహిళలకు స్మార్ట్‌కార్డులు జారీ చేసేందుకు యోచిస్తోంది.