పారిస్ ఒలింపిక్స్-2024 ఈవెంట్‌కు బెదిరింపులు పెరుగుతున్న వేళ ఫ్రెంచ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒలింపిక్స్ ఆటలకు AI నిఘా ఏర్పాటు చేసింది. ఇందుకోసం పారిస్ నగరం అంతటా ఉన్న సీసీ కెమెరాలను AIతో అనుసంధానించింది. దీంతో అనుమానాస్పద కదలికలను గుర్తించడం, తుపాకీని తీసుకెళ్లడం, వ్యక్తుల ఘర్షణలను తెలుసుకుని.. వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.