తెలంగాణలో కులగణనపై 2, 3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. నెల రోజుల్లోనే కుల గణన ప్రక్రియను పూర్తి చేయనున్నామని తెలిపారు. రిపోర్ట్ పారదర్శకంగా ఉండడానికి జీఏడీ లేదా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల్లో దేని ద్వారా కులగణన సర్వే చేయించాలనే దానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.