రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలో కొత్త రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. మూసీ పునరుజ్జీవ చర్యలు, హైడ్రా, 317 జీవో, ఉద్యోగుల డీఏలు, కొత్త రేషన్ కార్డుల జారీ తదితర అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు, క్రీడా పాలసీపైనా కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.