ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. రౌస్ అవెన్యూ కోర్టులో తన బెయిల్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడి ఉన్న సీబీఐ కేసులో ఆమె డిఫాల్ట్ బెయిల్ కోరారు. కవిత తరఫు లాయర్లు విచారణకు హాజరు కాకపోవడంతో జడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.