ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రావణ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని శ్రావణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దీంతో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది. కాగా, ఈయన ఓ మీడియా ఛానెల్ ఎండీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కేసులో నాంపల్లి కోర్టు శ్రావణ్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.