ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కార్ బడుల్లో విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. భోజనం చెడిపోవడంతో విద్యార్థులు అస్వస్థతకు గురైన కేసులపై నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. పాడైన ఆహారం ఘటనలపై రెండు కమిటీలు వేశామని ఏఏజీ కోర్టుకు తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడానికి ఏజెన్సీలకు చెల్లించే మొత్తాన్ని 40 శాతం పెంచినట్లు ఏఏజీ తెలిపారు.