స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ బాధ్యతను బీసీ కమిషన్ కు అప్పగించడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.